విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
Brazil Plane Crash: బ్రెజిల్లో క్రిస్మస్ పండగ ముందు మరో వివిషాద ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్యాసింజర్లు మృతి చెందారు.
దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అల్లు అర్జున్ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. దాడి ఘటనపై అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదుని జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. దాడి జరిగిన అంశంపై ఇంట్లో ఉన్న వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. ఈ క్రమంలో.. సెక్యూరిటీ సూపర్వైజర్ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు పోలీసులు.
Mohali Building Collapse: పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పుకూలిపోయింది. దీంతో సహాయక చర్యలు 15 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి.
Brazil Accident: బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 38 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైస్ రాష్ట్రంలోని హైవేపై శనివారం నాడు తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఉతప్పడైరెక్టర్గా ఉన్నారు. ఇక, ఇందులో పని చేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల అతడిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.