Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కుమార్తె సనాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు బలంగా ఢీ కొట్టింది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే, కోల్‌కతా నుంచి రాయ్‌చక్ వెళ్తున్న బస్సు.. బెహలా చౌరస్తాలో గంగూలీ కుమార్తె కారును వెనక నుంచి ఢీకొనింది. ఆ సమయంలో కారును డ్రైవర్ నడిపిస్తుండగా.. సనా పక్క సీట్లోనే కూర్చొని ఉంది.
Read Also: Zelensky: రష్యా నుంచి ఉక్రెయిన్ బందీల విడుదల.. జెలెన్ స్కీ ట్వీట్
ఈ ప్రమాదం తర్వాత బస్సు వేగంగా వెళ్లిపోవడంతో.. కారు డ్రైవర్ దాన్ని వెంబడించి.. కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సును అడ్డగించి గంగూలీ కుమార్తె సనా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో సనా గంగూలీ కారు స్వల్పంగా ధ్వంసమైందని పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే, ఈ ఘటనపై సనా గంగూలీ నుంచి ఎలాంటి అధికారిక కంప్లైంట్ రాలేదని పోలీసులు పేర్కొన్నారు.