Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
Explosion At Factory In Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలం…
Punjab Bandh: ఈరోజు పంజాబ్ రైతులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చాలా చోట్ల రహదారులను బంద్ చేసి రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
BPSC Exam Row: బీహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులతో పాటు మరో 700 మంది నిరసనకారులపై కేసు ఫైల్ చేశారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్‌ఖాలీలో ఈరోజు (డిసెంబర్30) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
Punjab Bandh: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా ఈరోజు (డిసెంబర్ 30) పంజాబ్ బంద్‌ను రైతులు ప్రకటించారు.