చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు..
దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అనుమానిత బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు.
Mumbai Boat Tragedy: అరేబియా సముద్రంలో ఫెర్రీని, నేవీ బోటు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్‌కు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ముంబైలోని కొలబా పోలీసులు ఇండియన్ నేవీ, మహారాష్ట్ర మారిటైం బోర్డుకు లేటర్ రాశారు.
రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఒక బడా బిర్యాని రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సైతం వ్యాపారులు ఆహ్వానించారు. అయితే.. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో నలుగురైదుగురు పోలీసులు రావడం, మళ్ళీ వారి కూడా వెళ్లిపోవడం సహజం. కానీ.. ఈ బిర్యానీ షాపు ప్రారంభం సందర్భంగా ఈ రోజు రూ.5 కే బిర్యాని అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీగా జనం బిర్యాని కోసం ఎగబడ్డారు. ఇంతవరకు బానే ఉన్నా..…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు..
Spy Camera: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ స్కూల్ డైరెక్టర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. టీచర్లు వినియోగించే బాత్రూంలో స్పై కెమెరాను అమర్చి.. తన కంప్యూటర్, మొబైల్ ఫోన్లో మానిటరింగ్ చేస్తుండగా.. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.