ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వద్దే బాంబు కన్పించడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, మణిపుర్‌లోని కొయిరెంగేయ్ ప్రాంతంలో సీఎంకు ప్రైవేటు నివాసం ఉంది. ఈ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఈరోజు (డిసెంబర్ 17) తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు.
Georgia: జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్‌గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే.
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు..
పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా... నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆరోపిస్తున్నారు జేసీ..
బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేశాయని చెప్పుకొచ్చారు. అయితే, వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ లో స్పష్టంగా ఉన్నప్పటికి.. కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని అడ్వకేట్ అశోక్ రెడ్డి వెల్లడించారు.