Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలో 2.8 కోట్ల రూపాయలు నష్టపోయామని సుబ్బారెడ్డి అనే బాధితుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Battula Prabhakar: చిత్తరు జిల్లాలోని సోమల పరిధిలో గల ఇరికి పెంట పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డిపల్లెకి చెందిన గజ దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిపై కన్న తండ్రి అవేదన వ్యక్తం చేశారు.
Aghori Arrested: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
Cremation dispute: అన్నదమ్ముల మధ్య తండ్రి అంత్యక్రియల వివాదం ఏకంగా, తండ్రి మృతదేహాన్ని సగం నాకు ఇవ్వాలని అనే దాకా వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికామ్గఢ్ జిల్లాలో జరిగింది. తండ్రి అంత్యక్రియల్లో సోదరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో అంత్యక్రియల వివాదంలో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టికామ్గఢ్ జిల్లాల ప్రధాన కార్యాలయం నుంచి 45 కి.మీ దూరంలో ఉన్న లిధోరాతాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిన్న కుమారుడు దేశ్రాజ్…
Student Suicide: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పేరు గత కొంత కాలం నుంచి మారుమ్రోగుతుంది. తాజాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కమర్హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు.
Hyderabad: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన యువకుడుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయింది.
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఫేస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు అని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి రూ. 2.06 డబ్బును కోల్పోయాడు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Suryapet: సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను మనవళ్లు చంపేశారు.