Suryapet: సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను మనవళ్లు చంపేశారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలో గల గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్మెంట్లో ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.
Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరామ్తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద సోమవారం నాడు కేసు నమోదు అయింది.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ కల్వర్టు కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్కి చెందిన శివ నందగా పోలీసులు గుర్తు పట్టారు.
విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు…