Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు. వంశీని కోర్టులో హాజరు పరిస్తే రిమాండ్ ను సవాలు చేస్తూ పిటిషన్ చేయటంపై చర్చిస్తున్నారు. రిమాండ్ విధిస్తే బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Donald Trump: ‘‘ టుడే ఈజ్ ద బిగ్ వన్’’.. సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..
అయితే, కృష్ణలంక పోలీసు స్టేషన్ లో వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి వంశీని ఎంక్వైరీ చేస్తున్నారు. పటమట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో వంశీకి ఆధారాలు చూపించి వివరణ తీసుకుంటున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి చేశారనే అభియోగాలతో వంశీపై కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలపై వంశీ వివరణను తీసుకుంటున్నారు.
Read Also: Bajrang Dal – VHP : రేపే ప్రేమికుల దినోత్సవం.. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కీలక ప్రకటన..
ఇక, విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించనున్నారు పోలీసులు. ఆ తర్వాత వంశీని విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. వల్లభనేని వంశీకి రిమాండ్ విధించాలని జడ్జిని పోలీసులు కోరే అవకాశం ఉంది. న్యాయమూర్తి వంశీకి రిమాండ్ విధిస్తే జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం 6గంటలకు హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలోని వల్లభనేని వంశీ ఇంటికి వెళ్లిన పటమట పోలీసులు.. అతడి భార్యకు నోటీసులిచ్చి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!
అయితే, వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఇంటి నుంచి 7. 30గంటలకు విజయవాడకు బయలుదేరారు పోలీసులు. రోడ్డు మార్గంలో విజయవాడకు వంశీని తీసుకొచ్చారు. ఉదయం11.30 గంటలకు గరికపాడు చెక్ పోస్టు ద్వారా ఏపీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు తొలుత భవానీపురం పీఎస్ కు వంశీని తరలించినప్పటికి.. అక్కడి నుంచి మధ్యాహ్నం 1గంటకు కృష్ణలంక పీఎస్ కు తరలించి అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు.