YSR Congress Party: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు కార్యాలయ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయి. జగన్ భద్రత విషయంలో ఇప్పటికే పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లాం.. అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు మేమే ఫిర్యాదు చేశాం అన్నారు. ప్రభుత్వం మారాక జగన్ నివాసం వద్ద బారికేడ్లను, సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారు. ఇప్పుడు మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు మాకే నోటీసులు ఇచ్చారు.. ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన పార్టీ నేతల సమాచారం పోలీసులకు ఇచ్చామని వైసీపీ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు పేర్కొన్నారు.
Read Also: Minister Kandula Durgesh: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి
ఇక, రోడ్డుపై అన్నీ వాహనాలకు అనుమతి ఇచ్చారు.. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఏఏ వాహనాలు నిలిపి ఉన్నాయో మా వద్ద సమాచారం లేదని చెప్పామని వైసీపీ పార్టీ కార్యాలయ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాలకు సంబంధించిన సామాగ్రి మొత్తం గతంలోనే అధికారులు తీసుకు వెళ్లారు.. మా దగ్గర ఆ డేటా అందుబాటులో లేదని చెప్పాం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో మా ఆందోళన పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రతినిధి నారాయణమూర్తి పేర్కొన్నారు.