Minister Sandhya Rani: విజయనగరంలోని వన్ టౌన్ పరిధిలో గల కలెక్టరేట్ దగ్గర తన బ్యాగ్ మిస్సైనట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ మెన్ జీవి రమణ తెలిపారు. మిస్ అయిన బ్యాగులో 30 రౌండ్స్ కలిగిన గన్ మ్యాగ్జైన్ తో పాటు విలువైన పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. బ్యాగ్ ఎక్కడో వదిలేసి ఆటోలో వదిలేసానని ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు సదరు గన్ మెన్ రమణ.. మద్యం మత్తులో ఆటో ఎక్కావ్ అంటూ కానిస్టేబుల్ తో వాగ్వివాదానికి దిగిన ఆటో డ్రైవర్.. విషయం తెలియడంతో ఆ బ్యాగ్ కోసం వన్ టౌన్ పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Uttam Kumar Reddy: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం..
ఇక, ఈ ఘటన జరిగిన ప్రాంతం సమీపంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్ఐలు మొత్తం వన్ టౌన్ సిబ్బందితో సహా గాలింపు చేపట్టినా ఇప్పటి వరకు ఆ బ్యా్ ఆచూకీ దొరకలేదు. బ్యాగ్ మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఘటన.. బ్యాగ్ మిస్సింగ్ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.