Lakshmi Reddy Arrest: తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుంది. తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టు ఆదేశాలతో జైపూర్ కు లక్ష్మీని తీసుకెళ్ళడానికి సిద్దమైన పోలీసులు.. న్యాయస్థానం లోపల నుంచి కారు దగ్గరకు వచ్చిన తర్వాత కళ్ళు తిరుగుతోందంటూ కింద పడిపోయిన లక్ష్మీ.. దీంతో వెంటనే, మళ్ళీ రుయా ఆసుపత్రికి ఆమెను తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు లక్ష్మీకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పరీక్షల్లో ఎలాంటి అనారోగ్య సమస్యల లేవని తేలడంతో కోర్టులో హాజరు పరిచిన జైపూర్ పోలీసులు.
Read Also: Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..
అయితే, కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని ఈ రోజు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల తర్వాత తిరుపతి కోర్టులో యూనివర్సిటీ పోలీసులు హాజరు పర్చారు. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉన్న నేపథ్యంలో జైపూర్ పోలీసులకు అప్పగించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, లక్ష్మీరెడ్డికి ప్రాణహాని ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకునేందుకు అవకాశం కల్పించింది కోర్టు. లక్ష్మీని చెన్నై మీదుగా జైపూర్ కు తీసుకెళ్లనున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో 2021లో జైపూర్, చంద్వాది పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు అయింది. అప్పటి నుంచి లక్ష్మీ రెడ్డి పరారీలో ఉండటంతో.. గత రెండు మూడు రోజులుగా ఏపీలోని మీడియాలో దర్శనం ఇవ్వడంతో రంగంలోకి దిగిన జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.