Student Kidnapped: కాకినాడ జిల్లాలోని తునిలో పరమేశ్ అనే బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. భాష్యం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడుని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి.. పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చారు సదరు దుండగులు. ఇక, మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకుని స్కూల్ కి పేరెంట్స్ వెళ్లారు. పాఠశాలలో తమ కొడుకు లేకపోవడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
Read Also: Stock Market: దెబ్బకొట్టిన ట్రంప్ నిర్ణయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
ఇక, స్కూల్ మొత్తం గాలించినప్పటికి బాలుడి ఆచూకీ కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా టానిక్ పట్టించాలని చెప్పి.. కొందరు వచ్చి తీసుకెళ్లారని తెలపడంతో.. తక్షణమే, తుని పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. అసలు ఎవరో తెలియకుండా స్కూల్ నుంచి బాబుని ఎలా బయటికి పంపించారని తల్లిదండ్రులు భాష్యం స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
Read Also: Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..
కాగా, తుని బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు వేగవంతం చేశారు. ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై స్కూల్ కి వచ్చి బాబును తీసుకుని వెళ్లినట్టు గుర్తించారు. బాబు తండ్రికి ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బాలుడిని తీసుకుని వైజాగ్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. తల్లితండ్రులు అనుమతి లేకుండా బాబుని స్కూల్ నుంచి పంపించిన టీచర్లను సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు.