యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..…
ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు…
కరోనా మహమ్మారి సమయంలో అందరినీ భయపెడుతోంది జోకర్ సాఫ్ట్వేర్.. దీనిబారినపడి యువత తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోకస్ సాఫ్ట్‌వేర్‌ను డిలీట్ చేసింది.. అయినా.. మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది.. యువతను దెబ్బకొడుతూనే ఉంది.. ముఖ్యంగా మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్వేర్ కుదిపేస్తూనే ఉంది.. వివిధ పద్ధతుల్లో మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్‌లపై ప్రత్యక్షమవుతూనే ఉంది.. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోంది.. బ్యాంకు వివరాల నుంచి…
ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్‌ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్ ఆడేవారు. జగన్ ముఖ్యమంత్రి…
హయత్ నగర్ పీఎస్ పరిధిలో వరుస చోరీలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. పోలీసులు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి. మూడు ఇళ్ళలో వరుస చోరీలు.. మరో ఇంట్లో చోరీ అటెంప్ట్ చేస్తున్న సమయంలో అలజడి కావడంతో దొంగలు పారిపోయారు. బంగారం, వెండి, నగదును దోచుకెళ్ళిన దొంగలు పక్కింటి వాళ్ళు బయటికి రాకుండా తలుపులకు గడియ బిగించారు. దొంగలకు చెందిన బ్లాంకెట్, టవల్ ను…
భారీగా గుట్కా, ఖైనీ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు రూరల్ పోలీసులు. 97లక్షల 72వేల విలువైన గుట్కా నిల్వలను పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురి నిందితులను అరెస్టు చేసారు. వారం రోజులుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ గుట్కా ర్యాకెట్ కేసు వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ… బెంగళూరుకు చెందిన తయారీదారు సిద్ధప్ప గుట్కా ర్యాకెట్లో కీలక పాత్రధారిగా గుర్తించాం అన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో 8 జిల్లాల్లోకి గుట్కా…
ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో…
విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు. ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్నాడు పల్లా. తుంగ్లాం, కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చి వేస్తున్నారు రెవెన్యు యంత్రాంగం. సర్వే నంబర్ 29/1 లో ఉన్న భూమి ఐదెకరాల 42 సెంట్లు భూమిలో ప్రహరీగోడలు తొలగించారు. ఈ…
తిరుపతిలో ప్రేమ పేరుతో మూడో పెళ్ళి చేసుకొని ఆరు లక్షలు దోచుకొని పరారయ్యింది మహిళ. దాంతో పోలీసులను ఆశ్రయించాడు చిత్తూరు జిల్లా విజయపురంకి చెందిన బాధితుడు. గత ఐదేళ్ళుగా తిరుపతి లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో కంపెనిలో పనిచేస్తున్నాడు యువకుడు. అదే కంపెనీలో పనిచేస్తు అనాథనాని యువకుడికి దగ్గరైంది సుహాసిని. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామని ఆరు లక్షల వసూళ్ళు చేసి నెమ్మదిగా పరారయ్యింది సుహాసిని. తాను మెసపోయినట్లు తెలుసుకుని యువకుడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు…