సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేసారు. ఓ కేసులో ఇద్దరు నిందితులను విచారణ కై పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు… విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ ను వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ తలపై ఆరు కుట్లు పడటంతో ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై…
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్ కుదుర్చుకున్నాడు.. అయితే, ఈ విషయం కుమారుడికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో, దాని వెనుక ఉన్న ఓ ముఠా గుట్టురట్టుఅయ్యింది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ లో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కోడలిని గుజరాత్‌కు…
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ దగ్గర ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు… మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఇక, వేగంగా దూసుకెళ్తున్న కారు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు.. కారు డ్రైవర్ అప్రమత్తతలో ప్రమాదం తప్పగా.. ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించాడు మరో యువకుడు.. ఆ ఇద్దరు అన్నదమ్ములు గుర్తించారు పోలీసులు.. అదే సమయంలో ప్రగతి భవన్ దగ్గర మంత్రి హరీష్‌రావు క్వానాయ్ రాగా.. క్వానాయ్ పైకి దూసుకెళ్లారు..…
గుంటూరు సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశం నిర్వహించడంపై కేసు నమోదు చేసారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్ ఇంటికి వెళ్లారు పటమట పోలీసులు. అయితే ఆ సమయంలో ఇంట్లో శ్రీధర్ లేకపోవడంతో 160 సిఆర్ పిసి కింద నోటీసు ఇచ్చారు పోలీసులు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కరోనా సమయంలో సమావేశం నిర్వహించడం కోవిడ్…
సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం బయట పడ్డింది. సంస్థల వెబ్ సైట్ లో సిఈఓ మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. అత్యవసరంగా 10 వేల రూపాలయల యామెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపారు. నిజమే అనుకుని గిఫ్ట్ కార్డ్ పంపారు నిజామాబాద్ గనుల శాఖ అధికారి.…
విశాఖ మేఘాద్రి రిజర్వాయర్ దగ్గర మద్యం మత్తులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి .అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ జరుపుకొని, మేఘాద్రి రిజర్వాయర్‌లో ఈతకు దిగి, గోపాలపట్నం 89 వ వార్డు ప్రాంతానికి చెందిన యువకులతో ఘర్షణ పడి కొట్లాటకు దిగారు. అక్కడ గొడవ సద్దుమణిగి కొత్తపాలెం ప్రాంతానికి చెందిన యువకులు భగత్ సింగ్ నగర్ వద్ద కాపు కాసి దాడి…
ఎల్బీనగర్ లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల మండలం పాత బ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరుతో విత్తనాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు & మాడ్గుల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే విత్తనాలు వినాయక ట్రేడర్స్‌లో బయటపడ్డాయి. 43 లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను…
ఆపదలో ఉన్న గర్భవతి మహిళను పోలీసులు కాపాడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వాహనాలు లేక ఇబ్బందిపడ్డా గర్భవతిని కాపాడారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. బోరబండ రాజీవ్ నగర్ కు చెందిన స్వాతి (20).. బోరబండ బస్ స్టాప్ వద్ద పురిటినొప్పులు రాగా అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంది స్వాతి. బోరబండ బస్ స్టాప్ లో…
ఇటీవల ఫేక్ నోట్లు ఎక్కువ చలామణి అవుతున్నాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇదిలావుంటే, తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72 లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5 లక్షల అసలు…