తమిళనాడులో దారుణం జరిగింది. ఓ అనాధాశ్రమం నుండి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారు కరోనాతో చనిపోయారని నాటకం ఆడారు ట్రస్ట్ నిర్వాహుకులు. మధురై జిల్లా మేలూరులోని “ఇదయం” ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారం క్రితం ఓ బాలుడ్ని ఐదు లక్షల విక్రయించారు ట్రస్ట్ సభ్యులు. అ బాలుడి తల్లి బాబును చూడటానికి వచ్చినప్పుడు కరోనాతో మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు సిబ్బంది. అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ట్రస్ట్…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
శంషాబాద్ గొల్లపల్లిలో వీరంగం సృష్టించారు బీహారీలు. రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు…
తెలంగాణ పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ ఫంక్షనల్ వర్టీకల్స్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డి.జి.పి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న…
హైదరాబాద్‌లో పోలీసులు వాహనాలపై దృష్టిసారించారు. నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా ఆ వాహనంపై దాదాపుగా 130 చలాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ గల స్కూటీని చెక్ చేయగా 2017 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చలానాల మొత్తం రూ.35,950…
హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట్‌లో ఓ ఆడిటర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. అయితే, ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్ కేసులు కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. ఆస్తితగాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని తెలుస్తోంది.. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనబావే ఈ స్కెచ్ వేశారని చెబుతున్నారు పోలీసులు.. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసిన సాంబశివరావు.. అప్పులోళ్లు వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక, మీ భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆందోళనకు గురైన…
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు…
రాజేంద్రనగర్ శివరాంపల్లి లో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న కానిస్టేబుల్ వాసు ఆత్మహత్య చేసుకున్నాడు. శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం వుంటున్న వాసు తన గది లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి తన గది లోకి వెళ్లి ఆత్మహత్య కు చేసుకున్నాడువాసు. అయితే ఉదయం గది నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారు పడ్డ భార్య… గట్టిగా కేకలు వేస్తూ బోరున విలపిస్తుండగా వాసు ఇంటికి…
అడ్డగూడూరు లాకప్ డెత్ పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటీషనర్ జయవింధ్యాల. నేడు ఈ ఘటన పై పూర్తి నివేదిక హైకోర్టు కు సమర్పించునుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ కస్టోడియల్ డేత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైతే రీ పోస్ట్ మార్టం చేయాలనీ న్యాయస్థానం సూచించింది. కానీ మరియమ్మకు పోలీసులు రీ పోస్ట్ మార్టం చేయలేదు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక…
ఆ జిల్లాలో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదట. అదేపనిగా ఆరోపణలు.. చర్యలు కామనైపోయాయి. ఒకప్పుడు చిన్న మెమో ఇస్తేనే గిల్టీగా ఫీలయ్యే సిబ్బంది.. ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు? నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై ఆరోపణలు! నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో పది స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న SIలు, CIలు, కానిస్టేబుళ్లపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. వేటు పడటం ఈ మధ్య…