హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం రూ.78 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్న డీఆర్‌ఐ.. ఇవాళ మరో రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ స్వాధీనం చేసుకుంది… దీంతో.. వారం రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది డీఆర్ఐ.. మరోవైపు.. హైదరాబాద్ శివారులో రూ.20 కోట్ల విలువైన గంజాయి పట్టుకుంది ఎన్సీబీ.. ఆంధ్ర నుంచి రోడ్డు మార్గంలో కోల్‌కతాకు తరలిస్తుండగా నలుగురు సభ్యులను అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. రూ. 20 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుంది.. ముంబై, గుజరాత్, ఢిల్లీ, బెంగళూరులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.. జీడిపప్పు బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తుండగా.. పట్టుకున్నారు అధికారులు.. ఒకేరోజు భారీ మొత్తంలో డ్రగ్స్, గంజాయి దొరకడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.