బీహార్‌లో ఓ వింత కేసు నమోదైంది. తన కలలోకి ఓ మాంత్రికుడు వచ్చి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఓ మహిళ. గతేడాది చివరిలో బీహార్‌లోని గాంధీనగర్‌లో ఉండే మహిళ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజలు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుటపడకపోగా, జనవరిలో మృతిచెందాడు. Read: అక్కడ పది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్… దీనిపై మాంత్రికుడిని…
పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ కామన్. అభిమానులు బూతులు తిట్టుకోవడం ఇంకా కామన్. ఇవి శ్రుతిమించి పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు రూటు మార్చేశారట. దానిపైనే ఇప్పుడు రాజకీయ.. పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎన్నికల్లో సోషల్ మీడియా పోస్టింగ్‌లకే డిమాండ్ఎదుటివారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కామెంట్స్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ వినియోగం పెరిగిన తర్వాత రాజకీయ పార్టీల…
అల్వాల్ పీఎస్ పరిధి హస్మత్ పేట్ సత్య సాయి ఎంక్లేవ్ లో మంగతాయారు 72 వృద్దురాలును దారుణంగా హత్య చేసాడు ఇంట్లో కిరాయి ఉంటున్న వ్యక్తి. బాత్రూమ్ లో మృతదేహాన్ని దాచిపెట్టాడు నిందితుడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి వెతకడం మొదలు పెట్టిన పోలీసులు… రాత్రి సమయంలో అదే ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ ఇంట్లోని బాత్రూమ్ లో…
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీసులకు వివిధ వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాలో మాత్రం కొందరు చేస్తున్న పనులు డిపార్ట్మెంట్కు మింగుడు పడటం లేదట. మరక తెస్తున్న బ్లాక్షీప్లను పట్టుకునే పనిలో పడ్డారట ఉన్నతాధికారులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. సిబ్బంది తీరుతో అధికారులకు తలనొప్పి! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అక్కడి అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఒకదాని వెనక ఏదో ఒక విమర్శలు రావడం..…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…
ఇరు వర్గాల మధ్య భూమి విషయంలో జరిగిన గొడవ.. ముగ్గురు హత్యలకు దారి తీసింది.. తెలంగాణలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో రెండు వర్గాల మధ్య పత్తి చేన్ల వద్ద వివాదం మొదలైంది.. మాటలు, వాగ్వాదం, తోపులాటతో.. చివరకు గొడ్డళ్లతో దాడి చేసేవరకు వెళ్లింది.. ఓ వర్గం గొడ్డళ్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తంద్రి, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు.. ముగ్గురుని హత్య…
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..…
ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు…
కరోనా మహమ్మారి సమయంలో అందరినీ భయపెడుతోంది జోకర్ సాఫ్ట్వేర్.. దీనిబారినపడి యువత తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోకస్ సాఫ్ట్‌వేర్‌ను డిలీట్ చేసింది.. అయినా.. మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది.. యువతను దెబ్బకొడుతూనే ఉంది.. ముఖ్యంగా మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్వేర్ కుదిపేస్తూనే ఉంది.. వివిధ పద్ధతుల్లో మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్‌లపై ప్రత్యక్షమవుతూనే ఉంది.. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోంది.. బ్యాంకు వివరాల నుంచి…