గుంటూరు గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కృష్ణ తల్లి మల్లీశ్వరి పరారైంది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి.. ఇద్దరు పిల్లలతోపాటు వెళ్లిపోయినట్టు సమాచారం. కృష్ణ ఆదేశాలతోనే తల్లి మల్లీశ్వరి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని రెండు బైకులపై నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. మరో నిందితుడు వెంకటరెడ్డి తల్లి, చెల్లి, భార్యను… ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆరు రోజులు గడుస్తున్నా… కృష్ణ, వెంకటరెడ్డి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కృష్ణ కుటుంబ సభ్యులు కూడా పరారవడంతో… పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.