ఎల్బీనగర్ లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల మండలం పాత బ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరుతో విత్తనాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు & మాడ్గుల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే విత్తనాలు వినాయక ట్రేడర్స్లో బయటపడ్డాయి. 43 లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను…
ఆపదలో ఉన్న గర్భవతి మహిళను పోలీసులు కాపాడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వాహనాలు లేక ఇబ్బందిపడ్డా గర్భవతిని కాపాడారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. బోరబండ రాజీవ్ నగర్ కు చెందిన స్వాతి (20).. బోరబండ బస్ స్టాప్ వద్ద పురిటినొప్పులు రాగా అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంది స్వాతి. బోరబండ బస్ స్టాప్ లో…
ఇటీవల ఫేక్ నోట్లు ఎక్కువ చలామణి అవుతున్నాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇదిలావుంటే, తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72 లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5 లక్షల అసలు…
బ్రహ్మంగారి మఠానికి సంబందించి పీఠాధిపతి ఎంపిక కోసం వారసుల మద్య ఆదిపత్యపోరు జరుగుతున్నది. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదానికి చెక్ పెట్టేందుకు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పలువురు పీఠాదిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం మఠం ఆలయ పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అలయంలోకి ఎవరిని అనుమతించడంలేదు. వారసుల మద్య సయోధ్యను కుదిర్చి పరిస్థతిని చక్కదిద్దేందుకు పీఠాధిపతులు ప్రయత్నం…
ఫిన్లాండ్ ప్రధానిగా సనా మారిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగుతు వేయిస్తున్నారు. చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న సనా మారిన్ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఇప్పుడు సనా మారిన్ కుటుంబం చిక్కుల్లో పడింది. బ్రేక్ఫాస్ట్ కోసం 300 యూరోలు ఖర్చు అయిందని చూపిస్తూ, ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నారని, స్థానిక మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై…
జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స…
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని…
కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు..…