భారీ గంజాయి ముఠాను అరెస్ట్ చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. మూడు కోట్లు విలువ చేసే..336 కేజీల గంజాయి సీజ్ చేసారు. ఏసీ కోచ్ లో చిన్న చిన్న బ్యాగ్ లలో పెట్టి గంజాయి తరలిస్తోంది ముఠా. వైజాగ్ నుండి ముంబై వెళ్లే LTT ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ఈ ముఠా పట్టుబడింది. లింగంపల్లి లో తనిఖీలు చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. 24 లాగేజ్ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 67 లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి సీజ్ చేసారు. వీరు ఈ గంజాయిని అరకు నుండి ముంబై తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 14 మంది ముఠా లో ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. అరకు చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో గంజాయి పండించే వారి వద్ద కొనుగోలు చేసింది ఈ ముఠా. ఇలాంటి ఘటనలు జరుగకుండా వైజాగ్ నుండి వచ్చే ట్రైన్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తాం అని హైదరాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ చంద్ర భాను పేర్కొన్నారు.