చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
పోలీస్ స్టేషన్‌కు కొన్నిసార్లు వింత వింత కేసులు వస్తుంటాయి. ఆ కేసులను చూసి పోలీసులు షాక్ అవుతుంటారు. కోడి కనిపించడం లేదని, కోడి గుడ్డు పెట్టడం లేదనే కేసులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి కర్ణాటకలోని హోలేహోన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సిద్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు నాలుగు ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను ప్రతిరోజు సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి…
ప్రస్తుతం విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాల్లోని ఏ పల్లెకు వెళ్లినా తగలబడుతున్న గంజాయి కుప్పలే కనిపిస్తాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ఫలితాలు ఇస్తోంది. వేలాది ఎకరాలలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. 214 కేసులు బుక్కయ్యాయి. 546 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా వాహనాలను సీజ్ చేశారు. వైజాగ్ ఏజెన్సీ, ఏవోబీలో దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగవుతోంది. ఎకరాకు 1000…
భారీ గంజాయి ముఠాను అరెస్ట్ చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. మూడు కోట్లు విలువ చేసే..336 కేజీల గంజాయి సీజ్ చేసారు. ఏసీ కోచ్ లో చిన్న చిన్న బ్యాగ్ లలో పెట్టి గంజాయి తరలిస్తోంది ముఠా. వైజాగ్ నుండి ముంబై వెళ్లే LTT ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ఈ ముఠా పట్టుబడింది. లింగంపల్లి లో తనిఖీలు చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. 24 లాగేజ్ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 67 లక్షల విలువ చేసే 336…
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో…
సైబర్ నేరాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అదునుచూసి.. డబ్బును లాగేస్తూనే ఉన్నారు.. ఎంతో మంది ఇప్పటికే కేటగాళ్ల బారినపడి లక్షల్లో డబ్బును పోగొట్టుకున్న ఘటనలు అనేకం.. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ సైతం సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. ఈ-కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్లు కామారెడ్డి కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న రంజిత్‌కు వలవేశారు.. అది కేటుగాళ్ల పనిగా గుర్తించని ఆయన.. వివరాలు చెప్పడంతో.. ఆయన…
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో తెలియడం లేదు. వరుస దొంగతనాల కేసులతో పోలీసులు సతమతమవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దొంగలు తమ చేతివాటం చూపెట్టారు. ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టారు దొంగలు. స్వాముల తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ దర్గా ఖలీజ్ ఖాన్ లో అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న స్వాముల బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేల నగదు, ఓ బైకును దుండగులు దొంగిలించారు. అర్ధరాత్రి…
ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు…
రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సయ్యద్ షాహిద్, పేదిరిపాటి శేఖర్ గౌడ్ అనే ఇద్దరు నిందితులు నకిలీ అగ్రిమెంట్ పేపర్లతో నగరంలోని ముసాపేట్‌లో 1500 గజాల విలువైన భూమిని అమ్మకానికి యత్నించారన్నారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకి రూ.11 కోట్ల 25లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిపారు. అడ్వాన్స్‌గా రూ. 1 కోటి 10 లక్షలను వ్యాపారవేత్త…
దిశ నిందితుల ఎన్కౌంటర్ తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ పై హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.ఈ కమిషన్ సభ్యులు ఆదివారం నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేస్తుంది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. దీంతో కమిషన్‌కు సుప్రీం కోర్టు గడువును పెంచింది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్…