శిల్పా చౌదరి కేసులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా కొకపేట ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ లో 36 వేలు , ఆక్సిస్ బ్యాంకు అకౌంట్ లో 14 వేలు గుర్తించారు పోలీసులు. అయితే పోలీసులతో 2 సంవత్సరాలు అమెరికా లో ఉన్నానని పోలీస్ లకు చెప్పిన శిల్పా… తనను అరెస్ట్ చేశాక.. నా మైండ్ బ్లాంక్ అయింది..నాకు డబ్బుల లావాదేవీలు ఏవీ గుర్తుకు రావడం లేదు. జైల్ కు వెళ్లినాక నా మతిస్థిమితం బాగోలేదు అని పోలీస్ లతో చెప్పింది శిల్పా. అయితే శిల్పా వాడిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 3 లక్షలు , 4 లక్షలు అని గుర్తించిన పోలీసులు.
పోలీసులు కోర్టు కు సమర్పించిన శిల్ప నేరాంగీకార పత్రంలో కీలక అంశాలు ఉన్నాయి. 2014 లో బ్రాండెడ్ బట్టల వ్యాపారం చేసిన శిల్పా.. స్టార్ హోటల్ లలో డిజైనర్ బట్టల ఎగ్జిబిషన్ పెట్టింది. ఆ సమయం లోనే పెద్ద,పెద్ద వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో పరిచయం ఉంది. వ్యాపారాన్ని పెంచుకోవాలని కిట్టీ పార్టీలు పెట్టింది. కోట్ల రూపాయలను 1 రూపాయి,2 రూపాయలు వడ్డీకి తీసుకుని, 10 రూపాయల వడ్డీ కి అప్పులు ఇచ్చిన శిల్పా… ఇతరుల బ్యాంక్ అకౌంట్ లలో డబ్బులు వేయించుకుని..తరువాత తన అకౌంట్ లోకి డబ్బులు మళ్లించుకుంది శిల్పా. అయితే ఎవరి నుంచి కూడా నేరుగా డబ్బులు తీసుకోకుండా జాగ్రత్త పడ్డింది శిల్పా.