గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.8,200 రూపాయల నగదు.. 3 స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో పట్టుబడ్డ వారు ఇద్దరు హరీశ్ ,రాజు తెలంగాణకు చెందినవారుకాగా, మరొకరు గుంటూరుకు చెందిన కిషోర్ రెడ్డిగా గుర్తించామన్నారు. వీరి పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చనున్నట్టు పోలీసులు తెలిపారు.