ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు ఖాతా నుంచి రూ. 350 ఫైన్‌ను ఎన్నికల కమిషన్ కట్ చేస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేసింది..
దీనిపై ఏకంగా ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చినా.. ఆ ఫేక్ న్యూస్ వైరల్‌ను మాత్రం ఆపలేకపోయింది… దీంతో.. ఈ ప్రచారాన్ని సృష్టించింది ఎవరు అనేది సీరియస్‌గా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. దీనికోసం ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగాన్ని రంగంలోకి దింపారు. ఈసీ క్లారిటీ ఇచ్చినా ఫేక్ న్యూస్ వైరల్ కాకుండా ఆగకపోవడం ఇప్పుడు తలనొప్పిగా మారింది.