ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు…
‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న…
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో ప్రసాద్.. దీంతో.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. కాగా, విజయనగరం రామతీర్థం బోడికొండపై బుధవారం…
ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు ఎక్కువ అయిపోయారు. వారికి అది ఇది అని ఏం పట్టింపులు ఉండవు ఏది దొరికితే అది చోరి చేసేయడమే వారి లక్ష్యం. తాజాగా గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు గొర్రెల మండి మిర్చి యార్డ్ వద్ద ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే బత్తుల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బత్తుల శ్రీను ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి…
ప్రభుత్వం ప్రెంఢ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ సర్వీస్ అంటూ అన్ని శాఖల్లో పారదర్శకత, ఉండాలని ప్రజలకు మెరుగైనా సేవలను అందించాలని పదే పదే చెబుతున్నా అక్కడక్కడ అధికారుల తొందరపాటు చర్యలకు సామాన్యులు బలి అవుతున్నారు. తాజాగా కమర్షియల్ టాక్స్ అధికారుల అత్యుత్సాహానికి డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్క్రాప్ లోడ్‌తో గుంటూరు నుంచి గజ్వేల్ వెళ్తున్న డీసీఎం డ్రైవర్ నబీలాల్‌ను అధికారులు ట్యాక్స్ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేసి కొట్టడంతో డ్రైవర్…
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్‌టాప్‌లు,…
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి…
కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.…
ఎండైనా, వానైనా, మంచైనా … ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం… కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్, మంచినీటి బాటిల్ పెట్టుకునే స్టాండ్ , గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…