చెడ్డీ గ్యాంగ్ కేసులో పురోగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించిన నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు..
ఈ వ్యవహారంలో దాహోద్ ఎస్పీతో మాట్లాడారు బెజవాడ సీపీ రాణా… ఇక, గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్న ఏపీకి చెందిన రెండు పోలీస్ బృందాలు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి. మొత్తంగా కొంత కాలంగా బెజవాడ, పరిసర ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్న చెడ్డీ గ్యాంగ్ పనిపట్టేందుకు పూనుకున్నారు విజయవాడ పోలీసులు. కాగా, కొంతకాలంగా ఈ గ్యాంగ్ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. ఇలా మొత్తంగా పురోగతి సాధించారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!