జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. రాజధాని శ్రీనగర్ శివారులోని పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. గామపడిని పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా గాలింపుచర్యలు చేపట్టారు.
Read: వైరల్: నీటి కుంటలో ఒకవైపు మనిషి… మరోవైపు సింహం…
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను మట్టుబెడతామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల అలజడి లోయలో పెరిగిపోతున్నది. ఆర్మీ ఆధీనంలో ఉన్న జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతుండటంతో ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. త్వరలోనే చట్టసభలను పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో ఉగ్రవాదుల కదలికలు, దాడులు జరుగుతుండటంతో పునరుద్దరించడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.