చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు.
పిల్లలు కనిపించకపోవడంతో అర్థరాత్రి దాటిన తర్వాత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు చేపట్టారు. వారికోసం చేసిన అన్వేషణ ఫలించింది. వారి ఆచూకి కనుక్కోగలిగారు. పాడుబడిన పటాచ్ చెరు రైల్వేస్టేషన్ సమీపంలో రాత్రి అంతా గడిపారు ఆ విద్యార్థులు. పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కథ సుఖాంతం అయింది.