శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. 3 రోజుల కస్టడీ ముగియడంతో శిల్పా చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఆమెను ఇప్పటికే 2 సార్లు కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసులకు శిల్పా సహకరించలేదు. దాంతో మరో సారి కస్టడీ కి తీసుకోనున్నారు నార్సింగి పోలీసులు. అయితే నేడు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం శిల్పా ఆస్తులు, అకౌంట్లు, పై ఆరా తీస్తున్నారు పోలీసులు.