తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు…
యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా వేధించడం ఎక్కువైంది. హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గాయత్రీహిల్స్‌లో బ్యూటీ…
ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్ష పై ఆంక్షలు విధించారు పోలీసులు. హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కానీ జనవరి 2 వరకు రాష్ట్రం లో బహిరంగ సభలు, ర్యాలీ లు నిషేధం అంటూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే దీక్ష కు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసింది.…
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్లైన్లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో…
చలి కాచుకునేందుకు ఓ దొంగ ఏకంగా బైక్‌నే తగలబెట్టాడు. ఈఘటన నాగపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. నాగపూర్‌లోని యశోదరా నగర్లో ఇటీవలి కాలంలో పలు బైక్ లు చోరికి గురయ్యాయి. దాంతో పలువురు వాహనాదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో ఓ ముఠాను అరెస్టు చేశారు. చోటా సర్ఫరాజ్‌తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్‌లను దొంగిలించినట్టు…
ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్ శివాజీ (23), బోయిన వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్థన్ రెడ్డి (23) ముగ్గు రు స్నేహితులు . వీరిలో వెంకటేశం, గోవర్థన్‌రెడ్డికి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరితో శివాజీ కలిశాడు. వీరు ముగ్గురు కలిసిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటి వేళ్లలో పుడ్ డెలివరీ బాయ్స్‌గా వెళ్లి…
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.…
జన్మదిన వేడుకల్లో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరూ బీరు బాటిళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సాయి రెడ్డి అనే యువకుడిని తోటి స్నేహితుడు బీరు సీసాలతో కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మ బండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు.…
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40…