ఉద్యోగ బదీలీల అంశంపై జాగరణకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతుండగా మైకుల్ని, కెమెరాలను లాగిన పోలీసులు వారి తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..నీ కొడుకు వేల మందితో ర్యాలీలు తీస్తే కోవిడ్ నిబంధనలు ఎటు పోయాయి.అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ ….నీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు…
కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు. డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి…
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన…
పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు.. కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో.. నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. ఇక, పర్యాటక కేంద్రమైన విశాఖలోనూ కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. రాత్రి 8 గంటల నుంచి అన్ని బీచ్‌లు మూసివేయనున్నారు.. రాత్రి 8 గంటల నుంచి ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం బీచ్, సాగర్‌నగర్ బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ…
న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. మందు వేద్దాం.. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం.. రచ్చ చేస్తామంటే కుదరదు.. ఎందకంటే.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు తెలంగాణ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించనున్నారు.. తాగి వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు.. ఇక, రెండో సారి పట్టుబడితే పదిహేను వేల ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు…
తాగి వాహనం నడిపితే పబ్‌లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్‌లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్‌ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని…
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహ కొన్ని నగరాల్లో కోవిడ్ దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా విశాఖనగరంలోనూ కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. వేడుకలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. డిసెంబర్ 31న యారాడ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు. Read Also:రైతులకు మోడీ సర్కార్ శుభవార్త నగర పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లను కూడా సాయంత్రం 6 గంటల…
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు…
యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తమకు ఇష్టం లేకపోయినా వేధించడం ఎక్కువైంది. హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని గాయత్రీహిల్స్‌లో బ్యూటీ…
ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…