హైదరాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెబ్ సైట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అమాయకులను నిందితులు ఆకర్షిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 140 మంది నుంచి దాదాపు కోటికి పైగా డబ్బును నిందితులు వసూలు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా వెల్లడించారు.
Read Also: Banjarahills Care Hospital: అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు సత్కారం
డీసీపీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ చేశాము అని వెల్లడించారు. నకిలీ వెబ్ సైట్స్, కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులకు మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ ను చిత్తూరు జిల్లా పీలేరు కేంద్రంగా నడుస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశాము అని ఆమె తెలిపారు. ఈ కేసులో సాయి శరన్ కుమార్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.. ఆన్ లైన్ లో ట్రేడింగ్ పేరుతో కాల్స్ చేయించి మోసం చేస్తున్నాడు అని సైబర్ క్రైమ్ డీసీపీ పేర్కొన్నారు. డీ మ్యాట్ అకౌంట్ యూజర్, పాస్ వర్డ్ తీసుకొని సాయి గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అని ఆమె వెల్లడించారు.
Read Also: Lokesh Kanagaraj: నేను షర్ట్ బటన్ పెట్టను… నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బాసు…
రోజు వారి ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని చెప్పి కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి అమాయక ప్రజలను నమ్మిస్తున్నారు అని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల మూఠా సభ్యులను అరెస్ట్ చేశాము.. 31ల్యాప్ టాప్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ కోసం అధికారులని కోరాము.. డేటా ఎక్కడ నుంచి తీసుకున్నారు అనేది విచారణ చేస్తున్నాం.. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా వెల్లడించారు.