రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది. ఆమె తండ్రి కృష్ణకు మమత హాస్పిటల్ యాజమాన్యం ఫోన్ చేసి అనుమానస్పదంగా ఉరి వేసుకొని తేజస్వీ చనిపోయిందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మమత హాస్పిటల్ లో తేజస్వీ నర్సుగా విధులు నిర్వహిస్తుంది.
Read Also: Video Viral: పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు
హాస్పిటల్ లో ఉరి వేసుకున్న రూమ్ నుంచి హుటాహుటిన ఆమెను ఉరితాడు నుంచి తీసి తల్లిదండ్రులు, పోలీసులు రాకుండానే.. శవాన్ని దింపి ఉస్మానియా హాస్పిటల్ కు తరలించినట్లు వారు ఆరోపించారు. మేము వచ్చేవరకు మా అమ్మాయి ఊరి పెట్టుకున్న దాన్ని అలాగే ఉండకుండా తీసి రహస్యంగా ఉస్మానియాకు తరలించడంతో తేజస్వీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మహేశ్వరం పోలీస్ స్టేషన్ ముందు భారీగా బైఠాయించిన గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. మహేశ్వరం పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థులు బైఠాయించి ఆందోళన చేశారు.
Read Also: New Delhi: ఇదో రకం హనీ ట్రాప్.. డేట్ కి తీసుకెళ్ళి బిల్ కట్టకపోతే కుర్రాడిపై లైంగిక దాడి?
అయితే, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. తేజస్వీ ఆత్మహత్యపై పూర్తి విచారణ చేసి నిజాలను బయటకు తీస్తామని మృతురాలి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మమత హస్పటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తేజస్వీ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.