Amarnath Yatra concludes: అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. దక్షిణ కాశ్మీర్‌లోని గుహ మందిరంలో 4.4 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేయడంతో వార్షిక అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. 62 రోజుల పాటు యాత్ర సాగింది. యాత్ర జూలై 1న బల్తాల్ మరియు పహల్గాం మార్గాల ద్వారా ప్రారంభమైన విషయం తెలిసిందే. తీర్థయాత్ర సందర్భంగా సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని 4,45,338 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Read Also: Kushi Twitter Review : ఖుషి హిట్టా.. ఫట్టా ట్విటర్ ఏం చెబుతుందంటే?
యాత్ర ప్రారంభం అయిన తరువాత పలు కారణాలతో యాత్రకు అవాంతరాలు ఎదరవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా అమర్‌నాథ్ యాత్ర ఇబ్బందులు పడుతూ ముందుకు సాగింది. యాత్ర సమయంలో మధ్యలో పలుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. తిరిగి ప్రారంభించాల్సి వచ్చింద. 62వ వార్షిక అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగియడంతో.. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా.. మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని దశనమి అఖారా నుంచి యాత్రను ప్రారంభించిన జాపత్రి గురువారం అమర్‌నాథ్ గుహ క్షేత్రానికి చేరుకుంది. ఆగస్ట్ 23న చివరి బ్యాచ్ యాత్రికులు గుహాలయానికి పూజలు చేశారని, హిమాలయాలలో ట్రాక్‌లను సరిచేయాల్సిన అవసరం ఉన్నందున, సంఖ్య తగ్గుతున్నందున తీర్థయాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం తీర్థయాత్రకు ఎక్కువ మంది భక్తులు హాజరైనట్టు అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం, 3,65,000 మంది యాత్రికులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.. ఇది 2016 నుండి అత్యధికమని చెప్పారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి తీర్థయాత్ర జూలై 1న అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్‌పై మరియు గండేర్‌బల్ జిల్లాలోని బల్తాల్‌పై ఏకకాలంలో ప్రారంభమైంది. పహల్గామ్ పొడవైనది కానీ సులభమైన మార్గమని అయితే, బాల్తాల్ మార్గం యొక్క ఏటవాలు చిన్నదైనప్పటికీ కష్టతరం చేస్తుందని.. యాత్ర ప్రశాంతంగా, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సాగిందని అధికారులు తెలిపారు.