బీహార్‌లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ వాళ్లు పార్టీ జెండాలు కట్టారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని జేసీ నిరసన వ్యక్తం చేశారు.
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన అంగన్వాడి వర్కర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే కొడాలని నాని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం అంగన్వాడీ వర్కర్స్ గుడివాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మధ్య దారిలో ఆపేశారు. Also Read: Karanam Dharmasri: వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా…
Rash Driving Case: రాజ్ భవన్ ప్రజా భవన్ వద్ద ఈనెల 24న అర్థరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కారులో బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ కావడంతో ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని తుమ్కాపాల్, డబ్బా కున్నా గ్రామాల మధ్య అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు.