రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే చెల్లించడం మంచిదన్నారు. ఎందుకంటే.. మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు.
బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కొడుకును గోవాలోని ఓ హోటల్లో హత్య చేసింది. ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ కీలాడి లేడీ కారులో ఎక్కింది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ బెదిరించి డబ్బులు గుంజుతుంది..
చర్లపల్లి లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్ రెడ్డి నగర్ & మధుసూదన్ రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిన్న రాత్రి భారీ శబ్దంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పేలుడు చోటు చేసుకుంది.
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ క్లోస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి.
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు..
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.