పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పేరుకుపోయిన చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లపై ఈ డిస్కౌంట్ కొనసాగనుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.. ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరో వైపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి కారు ఇసుక లారీ ఢీ కొన్నాయి.. కారులో ప్రయాణిస్తున్న ఏటూరు నాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు..
వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది.
లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులతో ఓ యువకుడు బలయ్యాడు.
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే, నేడు మీడియా ఎదుట నిందితులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకి తీసుకెళ్ళి నర హంతకుడు హత్య చేశాడు.
విశాఖపట్నంలో లంకే బిందలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్ లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.