కొంత మంది వింత చేష్టలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మందు తాగి నానా హంగామా చేస్తుంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు..
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసిఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను వెల్లడించారు. తన కోసం ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు లోపలికి అనుమతించాలని నిరసనకు దిగారు. వారంతా.. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా.. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అస్సలు వినడం లేదు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ..…
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.
తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు…
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు..