Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక, పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే చెల్లించడం మంచిదన్నారు. ఎందుకంటే.. మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు.
Read Also: IND vs AUS: మూడో టీ20లో భారత్ పరాజయం.. ఆస్ట్రేలియాదే టీ20 సిరీస్!
అలాగే, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించారు. బైక్‌లపై 80 శాతం తగ్గింపు, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని.. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే ఛాన్స్ ఉంది. ఇవాళే లాస్ట్ డేట్ కావడంతో వాహనదారుల ఒక్క సారిగా అలర్ట్ అయ్యారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించుకోవాలి.. నేడు మిస్ అయితే.. తర్వాత నుంచి ఈ డిస్కౌంట్ వర్తించదని పోలీసులు పేర్కొన్నారు.