YS Jagan: మేం ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసింది!
- కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్‌లు పెట్టింది
- అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?
- బడ్జెట్‌లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి
- కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్‌లు పెట్టిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని విరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పిందని పేర్కొన్నారు. తాము ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ మాట్లాడారు.
‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు బడ్జెట్‌లు పెట్టారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్‌లో ఆయన మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి తప్ప జరిగిన మేలు సున్నా. బడ్జెట్ కేటాయింపులపై గత ప్రెస్ మీట్‌లోనే అడగటం జరిగింది. కాగ్ రిపోర్ట్ కూడా నేను చెప్పిన అంశాలనే రుజువు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పింది. మా ప్రభుత్వం చివరి సంవత్సరం చేసిన ఖర్చు 2.36 లక్షల కోట్లు, వచ్చిన ఆదాయం 1.73 లక్షల కోట్లు. రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్రవ్యలోటు 62,720 కోట్లు. 2024 – 25 మధ్య చేసిన ఖర్చు 2.49 లక్షల కోట్లు, వచ్చిన ఆదాయం 1.68 లక్షల కోట్లు. రెవెన్యూ లోటు 60,285 కోట్లు, ద్రవ్యలోటు 81,071 కోట్లు. చంద్రబాబు మొదటి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గాయి. రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. అప్పులు మాకంటే 30 శాతం పెరిగాయి. మొదటి ఏడాది అసలు ఏ స్కీంలు ఇవ్వలేదు. మేము ఇచ్చిన స్కీములు కూడా రద్దు చేశారు’ అని వైఎస్ జగన్ అన్నారు.
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
‘2019 – 24 మధ్య కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా మానిఫెస్టో అమలు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులు 2024 – 25లో 32.55 శాతం అప్పులు చేశారు. ఇప్పటివరకు ఈ ఆర్ధిక సంవత్సరంలో 39.74 అప్పులు చేశారు. జీఎస్‌డీపీలో మేం చేసిన అప్పులు 4.111 శాతం. జీఎస్‌డీపీలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు 5.089 శాతం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపటంలో చంద్రబాబు విశ్వాసానికి ఇది ఉదాహరణ. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎన్బీసీని ఉల్లగిస్తూనే ఉంటారు. మరోవైపు పరిపాలనాదక్షుడిగా బిల్డప్ ఇస్తుంటారు. నెట్ బారోయింగ్ సీలింగ్కు మించి ప్రతిసారి అప్పులు చేస్తారు. మేం ఎప్పుడు ఎన్బీసీ పరిమితి కన్నారూ.12,707 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు మళ్లీ వచ్చాక చేసిన అప్పులు రూ.3.31 లక్షల కోట్లు దాటాయి. చేసిన అప్పులు మొత్తానికి జీవోలు కూడా ఉన్నాయి. మేం ఐదేళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు రెండేళ్ల లోపే చేశారు. ఆయన వస్తే ఎందుకు అప్పులు పెరుగుతున్నాయి?. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోవటమే దానికి కారణం’ అని జగన్ ఫైర్ అయ్యారు.
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్లుగా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, సహచరులు దేన్నీ వదలటం లేదు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తుంది. అన్నిట్లో దోపిడీ అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి. విశాఖలో ఐదు వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు దగ్గరుండి ఆయన సమీప బంధువులకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే ఆదాయాలు ఎలా వస్తాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు అతితక్కువ ధరకు భూములు ఇస్తున్నారు. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండటం లేదు. మేము కొవిడ్ సహా అనేక ఇబ్బందులతో రాష్ట్రాన్ని నడిపాం. 365 రోజుల్లో ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ ఉన్నది కేవలం 8 రోజులు మాత్రమే. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. మరోవైపు వాళ్ళు చేస్తున్న అప్పులు కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ప్రకారం రూ.81,082 కోట్ల అప్పులు చూపిస్తుంటే.. అసెంబ్లీలో రూ.60,485 కోట్లని చెప్పారు. ఇలాంటి రిపోర్టులు ఇచ్చి సభను తప్పుదోవ పట్టించినందుకు లేఖలు రాస్తున్నాం’ అని జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?