AP Crime: చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాడ్పడుతున్నారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. దీంతో.. ఇంట్లో వాళ్లను మందలించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ ఆత్మహత్య ఘటన విస్మయం కలిగిస్తోంది.. తన భర్త 50 రూపాయిలు ఖర్చులకు ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడింది భార్య.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పోన్నేపల్లిలో భర్త అనంతకుమార్‌తో కలిసి 27 ఏళ్ల రాధ అనే మహిళ నివాసం ఉండేది.. అయితే, ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు తనకు ఖర్చులకు రూ.50 ఇవ్వాలని భర్త అనంతకుమార్‌ను అడిగింది రాధ.. అయితే, డబ్బులు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు.. తనకు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపంతో సెల్‌ఫోన్ క్లీనింగ్ చేసే ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక ఎస్సై వివరించారు. సెల్‌ఫోన్ క్లీనింగ్ ఆయిల్ తాగిన రాధ తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు తెలిపారు. ఇక, రాధ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే పోస్టుమార్టం నిర్వఠహించి రాధ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పేర్కొన్నారు ఎస్ఐ.
Read Also: Chicken Piece: పార్టీలో ప్రాణం తీసిన చిక్కెన్ ముక్క.. గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి