Andhra Pradesh: సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా..? ఎక్కడి నుంచి అంటే ప్రజలు తొందరగా స్పందిస్తూ.. వారిని బుట్టలో ఎలా వేసేకొవచ్చో.. తెలుసుకుని మరి.. వారి ప్లాన్ అమలు చేస్తున్నారు.. అందినకాడికి దండుకుంటున్నారు.. విశాఖపట్నంలో వెలుగు చూసిన ఓ తాజా సైబర్ మోసం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం విదితమే కాగా.. ఆ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.. ఢిల్లీ కేంద్రంగా లబ్ధిదారులకు వల విసురుతుంది కేటుగాళ్ల ముఠా..
Read Also: Central Govt: బ్రిటన్ కు విచారణ సంస్థలు.. నీరవ్ మోడీ, విజయ్ మాల్యాను తీసుకొస్తారా..?
ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యదీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా? అంటూ ఫోన్‌లో పలకరిస్తారు మోసగాళ్లు.. లేదు తమకు ఈ పథకం డబ్బులు అందలేదని చెబితే.. వాళ్లకు పట్టు దొరికినట్టే.. ఎందుకంటే.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ నమ్మబలుకుతారు.. మీరు లబ్ధిదారులే అంటూ ట్రాప్‌లోకి దింపుతారు.. ఇదో లింక్.. ఆ లింక్ క్లిక్ చేయండి.. మీ వివరాలు నమోదు చేయండి.. వెంటనే ఆ పథకానికి సంబంధించిన నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అంటూ ముగ్గులోకి దింపుతారు.. ఇక, ఇదంతా నిమజే అని నమ్మి మోసగాళ్లు పంపిన లింక్‌ను క్లిక్ చేస్తే.. డబ్బులు వచ్చేది వట్టిమాటే.. కానీ, ఖాతా ఖాళీ కావడం ఖాయం అన్నమాట.. విశాఖలో ఓ బాధితుడు దగ్గర అమ్మ ఒడి పేరుతో లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్లు.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వ్యవహారం వెలుగు చూసింది.. ప్రభుత్వ పథకాల పేరుతో ఫోన్ కాల్స్ వస్తే నమ్మొద్దు అని సూచిస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసులు.