బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేస్ లో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పంజాగుట్ట కేస్ తో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేస్ వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజ మరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. కాగా, మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు,…
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్లోని ఎస్ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్…
కేరళలోని కన్నూర్లో ఒంటెపై పెళ్లి ఊరేగింపుగా వెళ్లినందుకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు 25 మంది సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు అభియోగాలు మోపారు. గుంపులుగా గుమికూడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Film Nagar: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు.