Bapatla Crime: బాపట్లలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది… గంజాయి సేవించి స్థానికులపై రౌడీషీటర్లు సుమంత్, రాహుల్ దాడులకు తెగబడ్డారు.. అయితే, రౌడీషీటర్లపై స్థానికులు తిరగబడ్డారు.. మొదట వినోద్ అనే కారు డ్రైవర్ పై దాడి చేశాడు రౌడీ షీటర్ సుమంత్.. స్థానికులపై కూడా దాడికి ప్రయత్నించాడు.. ఈ నేపథ్యంలో స్థానికులు తిరగబడ్డారు.. రౌడీ షీటర్లు సుమంత్, రాహుల్‌కు దాడి చేశారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ అనే రౌడీషీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఇక, స్థానికుల దాడి నుండి రాహుల్ అనే రౌడీ షీటర్ తప్పించుకొని పరారయ్యాడు. కాగా, రాహుల్, సుమంత్ ఇద్దరూ గంజాయి సేవించి స్థానికులపై తరుచూ దాడులు చేసేవారిని.. ఈ రోజు కూడా అలాగే దాడి చేస్తుంటే స్థానికులంతా ఒకేసారి తిరగబడ్డారని సమాచారం.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Ajit Pawar: శరద్ పవార్‌కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్‌దే..