కరీంనగర్ లోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృత దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు శాంతినగర్ కస్తూర్బా ప్రిన్సిపాల్ తరలించారు.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు.
విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామములో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కుర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు కూర్మారావు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.. దీంతో ఆ కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన ప్రదేశంలోనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాంలాల దర్శనం కోసం రామాలయం వెలుపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.