Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ఓ స్కూల్ కు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 13వ తేదీన ఆ ప్రాంతంలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను పేల్చివేస్తామంటూ బాంబు హెచ్చరికతో కూడిన మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం బాంబు బెదిరింపులకు దిగిన మెయిల్ రావడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఇక, బెదిరింపు మెయిల్‌తో అలర్ట్ అయిన పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: NTR: దేవర కోసం గుజరాతీ బ్యూటీని దించుతున్న కొరటాల శివ…
అయితే, అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, బాంబు స్క్వాడ్ స్కూల్ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బాంబు బెదరింపు మెయిల్ ఇవాళ ఉదయం 9 గంటలకు రాగా, దుండగులు డబ్బు కూడా డిమాండ్ చేశారని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను పోలీసులు ఖాళీ చేయించారు. ఇక, ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా స్కూల్ గేట్ దగ్గరకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వేచి ఉన్నారు.