తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును వీరు మూసివేయించారు.
Read Also: U 19 World Cup Final: ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డులు ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఈసీ చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే అన్నమయ్య కలెక్టర్ గిరీషా, అప్పటి తిరుపతి అడిషనల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
Read Also: Sunrisers Eastern Cape: వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన సన్ రైజర్స్.. కావ్య రచ్చ మాములుగా లేదుగా..!