నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు.
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని…
Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు దిల్కుష్ కుమార్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతంలో శవమై కనిపించగా, అక్కడే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.…
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
Murder: నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతోంటే, మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు మానవీయతకు, సంబంధాల సమతౌల్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తుల కోసం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దుశ్చర్యలకు వెనకాడకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే, రక్త సంబంధాలను కూడా వదిలిపెట్టకుండా, తమ దురాశ కోసం మరణాలకు కూడా కారణమవుతున్నారు. ఇటువంటి శోచనీయ సంఘటన పాల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు…
Instagram Love : ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. బెంగళూరులో ఇన్ స్టాలో ప్రేమ పేరుతో రూబియా(22)కు మహారాష్ట్రకి చెందిన మన్వర్(28) పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 8 నెలల పాటు బెంగళూరులో యువతితో మన్వర్ సహజీవనం చేశాడు. అయితే.. 10 రోజుల క్రితం బెంగళూరులో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న మన్వర్ తల్లితండ్రుల వద్దకి వచ్చారు జంట. మన్వర్ తల్లిదండ్రులు ఒప్పుకోకొకపోవడంతో ఇంట్లో గొడవ జరిగింది. భర్త మన్వర్ కూడా…
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకటరమణ కృష్ణవరంగా గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వివాహిత పట్ల వెంకటరమణ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం
నిన్నటి నుంచి పరారీలో ఉన్నారంటూ, లేదు అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న మోహన్ బాబు ఎట్టకేలకు ట్వీట్ ద్వారా తాను పరారీలో లేనని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులకు సైతం మోహన్ బాబు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, కాబట్టి కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అలా కుదరదని విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్లుగా తెలుస్తోంది. సరే అంటూ పోలీసుల…