తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్…
Physical Harassment : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా…
కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెబుతుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు.
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విసిరేసారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఏలూరు అశోక్ నగర్ అమలోద్భవి స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.