Karnataka : డబ్బు, మహిళ, భూమి అనే మూడింటి కోసం ప్రతి మనిషి ఏదైనా చేస్తాడని అంటుంటారు. అది కూడా నిజమే. కర్ణాటక నుండి ఈ మూడు విషయాలకు సంబంధిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి తన తమ్ముడిని హత్య చేయించి ఏమాత్రం అనుమానం రాకుండా తప్పించుకుందాం అనుకున్నాడు. తన తమ్ముడిని హత్య చేసేందుకు కొంత మందికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు ప్రయాగరాజ్ వెళ్లాడు. కానీ పాపం నిజం బహిరంగం అయిపోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన ఫిబ్రవరి 11న జరిగింది. అక్కడ కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూర్ తాలూకాలో 45 ఏళ్ల రైతు కృష్ణ గౌడ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యపై దర్యాప్తు చేయగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. కృష్ణ గౌడ.. అన్నయ్య అయిన శివనంజే గౌడే నిందితుడని తేలింది. తన సోదరుడిని చంపడానికి శివనంజే గౌడ రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. పోలీసులు హత్యకు కారణం భూ వివాదామే అని తేల్చేశారు.
Read Also:Summer Fruits: వేసవిలో తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!
వివరాల్లోకి వెళితే కృష్ణ గౌడకు చాలా అప్పులు ఉన్నాయి. దీంతో అతడి అన్న శివనంజే గౌడ వాటిని తిరిగి చెల్లించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రతిగా కృష్ణగౌడ తన ఆస్తిని తన అన్నయ్య భార్య పేరు మీద బదిలీ చేయాల్సి వచ్చింది. కానీ కృష్ణగౌడ ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. అంతేకాకుండా, అతను శివనంజే గౌడ భార్య గురించి కూడా చెడుగా ప్రచారం చేశాడు. ఇది శివనంజే గౌడకు కోపం తెప్పించింది. దీంతో తన తమ్ముడిని చంపడానికి చంద్రశేఖర్, సునీల్, ఉల్లాస్, ప్రతాప్, అభిషేక్, శ్రీనివాస్, హనుమనేగౌడలకు రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. వారు కృష్ణ గౌడను అతి దారుణంగా హత మార్చారు.
నిందితులను విచారించినప్పుడు శివంజయ్ గౌడ పాత్ర కూడా ఇందులో ఉందని పోలీసులకు తెలిసింది. హత్యకు ఒక రోజు ముందు శివనంజే గౌడ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాడని మాండ్య ఎస్పీ మల్లికార్జున బాల దండి తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పుణ్యస్నానాలు చేసేందుకని అందరకీ చెప్పి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్ డిటైల్ రికార్డులు (CDR), ఇతర సాంకేతిక ఆధారాలు కృష్ణ హత్యకు కనీసం రెండు నెలలుగా ప్రణాళికలను రచిస్తున్నట్లు చూపించాయి. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి 11న కృష్ణ గౌడను హతమార్చారు.
Read Also:MLC Kavitha: తెలంగాణలో కేసీఆర్ను తలవని గుండె లేదు.. ఈ పాలనలో తీవ్ర ఇబ్బందులు